“ఆచార్య” డేట్ తో టెన్షన్ టెన్షన్.!

Published on Oct 5, 2021 8:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ పలు కారణాల చేత ఆచార్య రిలీజ్ డేట్ కి నోచుకోలేదని చిరు ఇటీవల తెలిపారు. మరి ఇపుడు ఈ సినిమా రిలీజ్ పై ఎట్టకేలకు ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాని వచ్చే డిసెంబర్ 17న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసినట్టుగా నయా టాక్. దీనితో ఇక్కడ నుంచే అసలు టెన్షన్ పట్టుకుంది.

ఎందుకంటే సరిగ్గా ఇదే డేట్ కి అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” ఆల్రెడీ డేట్ లాక్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు సినీ వర్గాల్లో ఆచార్య కూడా అదే డేట్ కి ఫిక్స్ అయ్యింది అని సమాచారం వస్తుంది. దీనితో ఈ రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఒకే డేట్ కి వస్తే ఎలా అనే టెన్షన్ ఇపుడు అందరిలో కూడా మొదలయ్యింది.

సంబంధిత సమాచారం :