టాక్..”భీమ్లా నాయక్” కి వర్తించని కొత్త ధరలు.?

Published on Mar 12, 2022 7:16 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పలు కారణాల చేత ఏపీలో పాత జీవో ప్రకారమే తక్కువ ధరలతోనే రిలీజ్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా వచ్చిన రెండు వారాల తర్వాత నిన్న ప్రభాస్ సినిమా “రాధే శ్యామ్” రిలీజ్ తో ఏపీలో కొత్త ధరలు దర్శనం ఇచ్చాయి.

పలు చోట్ల స్పెషల్ హైక్స్ తో పాటు ఇతర సినిమాలు కూడా కొత్త జీవో ప్రకారమే టికెట్ ధరలు కనిపిస్తుండగా “భీమ్లా నాయక్” కి మాత్రం అది విడుదల అయ్యినప్పటి నాటి సాధారణ ధరలే కనిపిస్తుండడం గమనార్హం అని పవన్ అభిమానులు అంటున్నారు. కొత్త జీవో వచ్చాక అప్పటి నుంచి అయినా టికెట్ ధరలు మారవలసి ఉంటుంది. అయినా ఎందుకు ఇంకా పాత ధరలే ఉన్నాయని ఆసక్తిగా మారిన ప్రశ్న. మరి దీనికి గల కారణం ఏమిటో అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :