అచ్చ తెలుగు టైటిల్స్‌కే ఓటేస్తోన్న నిర్మాతలు!

9th, August 2016 - 05:19:01 PM

TFI
ఒక సినిమాకు స్టార్ క్యాస్ట్, టెక్నీషియన్స్ తర్వాత మొదట్లోనే క్రేజ్ రావడానికి ఉపయోగపడేది టైటిలే. హీరో స్థాయి, కథ అవసరం, కొత్తదనం, నేపథ్యం.. ఇలా వివిధ కారణాలతో దర్శక, నిర్మాతలు రకరకాల పేర్లను ముందుకు తెస్తుంటారు. తాజాగా కొత్తగా ఛాంబర్‌లో రిజిస్టర్ అయిన కొన్ని టైటిల్స్‌ని పరిశీలిస్తే, తెలుగు సినిమా మళ్ళీ అచ్చ తెలుగు పేర్లనే ఎక్కువ ఇష్టపడుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఆకతాయి’, ‘అలకనంద’, ‘చీకటి ప్రేమకథ’, ‘జగదేకవీరుని కథ’, ‘ధైర్యే సాహసే లక్ష్మి’, ‘శతమానం భవతి’, ‘విచిత్ర కుటుంబం’, ‘పెదవి దాటని మాటొకటుంది..’ లాంటి టైటిల్స్ ఈ విషయాన్నే ఋజువు చేస్తున్నాయి.

చిన్న సినిమాలతోనే పెద్ద గుర్తింపు తెచ్చుకున్న మధుర శ్రీధర్ ‘చీకటి ప్రేమకథ’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఆయన తీయబోయే అడల్ట్ ప్రేమకథకు ఈ టైటిల్ పెట్టనున్నారని ఊహించొచ్చు. ఇక అల్లు శిరీష్‌తో సినిమా చేస్తోన్న శైలేంద్ర ప్రొడక్షన్స్ ‘జగదేకవీరుని కథ’ అన్న టైటిల్‌ను రిజిస్టర్ చేయించింది. ఇవికాకుండా దిల్‌రాజు సంస్థ ‘శతమానం భవతి’ అనే టైటిల్‌ను, మారుతి టీమ్ వర్క్స్ ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అన్న టైటిల్‌ను, పూరీ టూరింగ్ టాకీస్ ‘రొమాంటిక్’ అన్న టైటిల్‌ను.. ఇలా పలు టాప్ ప్రొడక్షన్ సంస్థలు, నిర్మాతలు పలు ఆసక్తికర టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారు. ఆ వివరాలను కింద తెలియజేస్తున్నాం.

1

2