‘బాలయ్య’తో స్పెషల్ సాంగ్ ?

Published on May 16, 2023 1:00 am IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అనిల్ రావిపూడి ఏ హీరోయిన్ని అప్రోచ్ అవుతాడో.. ఎవరితో బాలయ్యకి జోడిగా స్టెప్ లు వేయిస్తాడో చూడాలి. ఇక వచ్చే షెడ్యూల్ లో బాలయ్య – శ్రీలీల కాంబినేషన్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేయనున్నారు.

మొత్తమ్మీద సినిమాలో శ్రీలీల – బాలయ్య కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ ట్రాక్ చాలా బాగుంటుందట. ఇక బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :