మహేష్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్

Published on May 15, 2023 10:00 am IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ డ్యూయల్ రోల్‌‌ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ ఒక క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. అయితే, దుర్మార్గుల పై విలనీజం ఉన్న ఓ హీరో చేసే ఫైట్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని తెలుస్తోంది.

ఇక మహేష్ – త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని ఈ సినిమాని నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2023 సంక్రాతికి విడుదల చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :