యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ సినిమా రాబోతుంది. మరో నెల రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ బయటకు రాబోతున్నాడు. సో.. అప్పుడైనా ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమాని ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేస్తాడా ?, మరోపక్క వార్ 2 పూర్తి అయ్యాకే.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కి డేట్స్ ఇస్తాడని టాక్ నడుస్తోంది.
మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. కాకపోతే.. ప్రశాంత్ నీల్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం అని.. అందుకే ఆ పాత్రలో స్టార్ హీరోయిన్నే తీసుకోనున్నాడు. ఇంతకీ, ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో తన సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఇండియా – పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.