దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. పైగా ‘వారణాసి’ (Varanasi) చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఐతే, ఈ సినిమా కోసం రాజమౌళి మరో కొత్త పాత్రను తీసుకున్నారని.. మహేష్ పాత్రతో పాటు సినిమాలో మరో స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని.. ఇది నెగిటివ్ పాత్ర అని, ఈ నెగిటివ్ పాత్రలో మరో బాలీవుడ్ నటుడు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
