వరుణ్ తేజ్ ‘మిస్టర్’ షూటింగ్ అప్డేట్స్

mister
కంచె, లోఫర్ వంటి సినిమాలతో సక్సెస్ జోరుమీదున్న మెగాహీరో ‘వరుణ్ తేజ్’ తాజాగా దర్శకుడు ‘శ్రీను వైట్ల’ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ షూటింగ్ షెడ్యూల్ ఇంకా ఆగష్టు 4 వరకూ స్పెయిన్ లోనే జరగనుంది.

ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది.
హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి వైవిధ్యభరితమైన కథలనే ఎంచుకుంటూ ముందుకెళుతున్న వరుణ్ తేజ్ ఈ చిత్రం తరువాత ‘శేఖర్ కమ్ముల’ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.