బడ్జెట్ ప్లాన్ లో ‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమా !

Published on Oct 31, 2021 6:15 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ ఇంకా ఒక క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి.. మొదట బడ్జెట్ కూడా పాన్ ఇండియా బడ్జెట్ ఉండాలనుకున్నారు. అయితే, ఈ సినిమాకు హిందీలో వచ్చే మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే.. పాన్ ఇండియా బడ్జెట్ వర్కౌట్ కాదు అనేది మేకర్స్ ఆలోచన.

అందుకే.. బడ్జెట్ ను ఓవర్ గా పెట్టకపోవడమే మంచిది అని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగూ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ పూర్తి అయింది కాబట్టి.. త్వరలోనే బడ్జెట్ పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ‘అరవింద సమేత, ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా ఇది. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది.

సంబంధిత సమాచారం :