సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అర్జున్ రెడ్డి’ !


సైలెంట్ గా మొదలై టీజర్ తో సంచలనం సృష్టించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో అసలు సినిమాలో కంటెంట్ ఏంటో చూడాలని ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకాస్త పెరిగింది. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనుల్ని కూడా కంప్లీట్ చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలో ఉన్న హార్డ్ హిట్టింగ్ కంటెంట్ వలనే సెన్సార్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలకానుంది. థియేటర్ ఆర్టిస్ట్ షాలిని హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో అలనాటి కాంచ‌నతో పాటు విపిఎస్. కళ్యాణ్, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌ లు ప్రధాన పాత్రలు పోషించారు.