ఆహా వీడియో లో న్యూసెన్స్‌కి సూపర్ రెస్పాన్స్!

Published on May 16, 2023 8:47 pm IST

యంగ్ హీరో నవదీప్ మరియు బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఇది రీసెంట్ గా ఆహా వీడియో లో స్ట్రీమింగ్ కి వచ్చింది. షో కథనాన్ని జర్నలిస్ట్ ప్రియదర్శిని రామ్ అందించారు. ఇది మీడియా పరిశ్రమలోని చీకటి కోణాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్ కి మంచి రివ్యూస్ వచ్చాయి. మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది.

నవదీప్ నటన, సీరిస్ ను తెరకెక్కించిన విధానం చర్చనీయాంశంగా మారాయి. న్యూసెన్స్ కోసం రెండవ సీజన్ కూడా ఉంది. ఇది మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీ ఇంకా ప్రకటించబడలేదు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్రోల్ చేసింది. దీనికి శ్రీ ప్రవిన్ కుమార్ దర్శకత్వం వహించారు. నంద గోపాల్, రమేష్ కోనంభొట్ల, పూర్ణ చంద్ర, కట్టా ఆంటోని, నల్లా శ్రీధర్ రెడ్డి, గణేష్ తిప్పరాజు, వెంకట రమణ అయ్యగారి కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :