‘గుంటూరు కారం’ నుండి నెక్స్ట్ బిగ్ అప్ డేట్ అప్పుడే – నిర్మాత నాగవంశీ

Published on Jun 1, 2023 2:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తర్కెక్కుతున్న మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా గుంటూరు కారం. యువ నటీమణులు పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇక నేడు విడుదలైన గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కి అందరి నుంచి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. కాగా దానికి అంతటి భారీ రెస్పాన్స్ అందించినందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పిన నిర్మాత వంశీ, తదుపరి తమ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ని మహేష్ బాబు బర్త్ డే రోజైన ఆగస్టు 9న అందించనునట్లు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు. కాగా ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్స్ లోకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :