“భీమ్లా నాయక్” మాస్ సాంగ్ పై నెక్స్ట్ లెవెల్లో హైప్.!

Published on Nov 6, 2021 3:15 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ “లా లా భీమ్లా” పై ఉన్న హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

దీనిని సినిమా గ్లింప్స్ లో చూసినప్పటి నుంచి మాస్ ఆడియెన్స్ లో విపరీతమైన బజ్ ఉంది. మరి ఫైనల్ గా ఈ సాంగ్ ని అనౌన్స్ చేసే నాటికి అదిరే లెవెల్ హైప్ వచ్చేసింది. ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ కూడా ఇంటర్నెట్ గెట్ రెడీ అమ్మా అంటూ మరింత హైప్ ఎక్కిస్తున్నాడు. ఓవరాల్ గా మాత్రం ఈ మాస్ సాంగ్ పై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇక కంప్లీట్ గా రిలీజ్ అయ్యాక ఎంత మేర రీచ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :