సుజీత్ – పవర్ ప్రాజెక్ట్ పైనే భారీ హైప్..!

సుజీత్ – పవర్ ప్రాజెక్ట్ పైనే భారీ హైప్..!

Published on Dec 6, 2022 7:00 AM IST

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా కాలం తర్వాత ఎక్కడ లేని ఓ ఎనర్జీ వచ్చింది అని చెప్పాలి. పవర్ స్టార్ నుంచి వరుస రెండు ప్రాజెక్ట్ లు ఓకే అయ్యాయి అనే వార్త కన్నా రెండు కూడా డైరెక్ట్ సినిమాలే రీమేక్స్ కాదు అనే వార్తలు మరింత ఎగ్జైటింగ్ గా మారాయి. మరి ఆ రెండు సినిమాలు కూడా పవన్ ఇద్దరి ఫ్యాన్ దర్శకులే కావడంతో నెక్స్ట్ లెవెల్ హైప్ ఇప్పుడు సెట్ అయ్యింది.

అయితే వీటిలో మాత్రం పవన్ ఫ్యాన్స్ ఒకింత సుజీత్ తో ప్రాజెక్ట్ కోసం బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. హరీష్ శంకర్ తో ఆల్రెడీ పవన్ ని చూసారు కాబట్టి సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్ టేకింగ్ పవన్ పై డెఫినెట్ గా మరింత సాలిడ్ గా ఉంటుంది అని వారు అనుకుంటున్నారు. దీనితూ ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ప్రత్యేకంగా వారు పెట్టుకున్నారు. మరి దీనితో అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై సెపరేట్ హైప్ నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు