యూఎస్ లో “RRR” స్పెషల్ షో కి మాత్రం నెక్స్ట్ లెవెల్లో రెస్పాన్స్.!

Published on Jun 2, 2022 12:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది.

అయితే ఈ సినిమాకి ఓటిటి లో వచ్చాక రెస్పాన్స్ గాని ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ కానీ వేరే లెవెల్లోకి వెళ్లాయి. దీనితో ఈ హైప్ ని మరింత ఎక్కిస్తూ యూఎస్ లోని భారీ స్థాయిలో ఈ జూన్ 1న సినిమా ఒరిజినల్ కట్ ని స్పెషల్ షోస్ కి ప్లాన్ చెయ్యగా దీనికి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా ఈసారి షో ని అధికంగా యూఎస్ సిటిజన్స్ అంటే ఇంగ్లీష్ వారే అధికంగా చూశారట. ఆల్రెడీ చాలా మంది చూసినవారు తప్పకుండా తమ ఫ్రెండ్స్ ఫామిలీ కి సజెస్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఒక హాలీవుడ్ సినిమాని చూసిన విధంగా వారు ఈ సినిమాని చూడడంతో పలు ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :