“18 పేజెస్” నుండి మరో సాంగ్ రిలీజ్ కి రెడీ!

“18 పేజెస్” నుండి మరో సాంగ్ రిలీజ్ కి రెడీ!

Published on Dec 6, 2022 11:50 PM IST


టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కార్తికేయ2 బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఈ హీరో, 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నుండి మరో సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

సిద్ శ్రీరామ్ పాడిన లవ్ సాంగ్ డిసెంబర్ 9 న రిలీజ్ అవుతున్నట్లు హీరో నిఖిల్ తెలిపారు. జీఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ల పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ సుకుమార్ అందించగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు