ఎన్ జి కె విడుదల తేదీ ఫిక్స్ !

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్ జి కె’ కొచ్చిషెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈచిత్రం యొక్క ఫైనల్ షెడ్యూల్ పొల్లాచ్చి లో జరుగనుంది. విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ఈచిత్రాన్ని తమిళ్ తోపాటు తెలుగు లో తమిళ న్యూ ఇయర్ రోజు ఏప్రిల్ 14న విడుదలచేనునున్నారు. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈచిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇక సూర్య ఈ చిత్రం తోపాటు కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమా కూడా వచ్చే ఏడాదే విడుదలకానుంది.

Exit mobile version