ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘హరిహర వీరమల్లి’, ‘ది రాజా సాబ్’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ హార్రర్ కామెడీగా దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ రెండు చిత్రాల్లో అందాల భామ నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్స్‌లో ఆమె తన పాత్రకు సంబంధించిన షూట్లో పాల్గొంటోంది. కాగా ఒకేరోజున రెండు బడా స్టార్స్‌తో, రెండు పాన్ ఇండియా చిత్రాల్లో షూటింగ్ జరుపుకోవడం చాలా అరుదుగా వచ్చే అవకాశం అని.. తనకు ఇలాంటి ఛాన్స్ దొరికినందుకు సంతోషంగా ఉందని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆంధ్రలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే, తెలంగాణలో మరొకటి షూటింగ్ జరుపుకుంటున్నట్లు నిధి తెలిపింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
An artists life is full of surprises, but some leave you feeling truly blessed and grateful. I’m delighted to have shot for 2 much waited pan-Indian films on the same day, that too one in Andhra and another in Telangana
1 day 2 film shoots 2 states ????
Eagerly waiting for you all…— Nidhhi Agerwal (@AgerwalNidhhi) October 17, 2024