‘రాజా సాబ్’లో నిధి సర్‌ప్రైజ్ చేస్తుందా..?

‘రాజా సాబ్’లో నిధి సర్‌ప్రైజ్ చేస్తుందా..?

Published on Jan 26, 2025 2:11 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హార్రర్ కామెడీ జోనర్ మూవీలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా కూడా ప్రేక్షకులను స్టన్ చేయనున్నాడు.

ఈ సినిమాలో అందాల భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర కూడా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఓ సినిమాలో నటిస్తుందంటే ఆమె నుంచి గ్లామర్ డోస్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియెన్స్. అయితే, ఈ సినిమాలో ఆమెను ఎవరూ ఊహించని విధంగా చూపించబోతున్నాడట దర్శకుడు మారుతి.

మరి ఈ సినిమాలో నిజంగానే నిధి అగర్వాల్ పాత్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తుందా.. అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు