బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అందుకున్నా అంటున్న నిధి అగర్వాల్!

Published on Aug 17, 2021 7:00 pm IST

టాలీవుడ్ నటి, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్రాల్లో నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలు పోస్టర్లు విడుదల అయ్యాయి. పోస్టర్ లను విడుదల చేస్తూ నిధి అగర్వాల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదే తరహాలో నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారి హర వీర మల్లు చిత్రం లో లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో నిధి అగర్వాల్ పంచమి పాత్ర లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

హారి హర వీరమల్లు చిత్రం నుండి పంచమి పాత్ర కి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం పట్ల నిధి అగర్వాల్ స్పందించడం జరిగింది. ఇది బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్, మోస్ట్ టాలెంటెడ్ క్రిష్ దర్శకత్వం వహించారు అని అన్నారు. నిర్మాత ఏ ఎం రత్నం కి కృతజ్ఞతలు తెలిపారు. నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్ కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం :