నితిన్ “మాచర్ల నియోజకవర్గం”లో ఇస్మార్ట్ బ్యూటీ?

Published on Sep 18, 2021 1:30 am IST


యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ చిత్రం నేడు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే నితిన్‌ హీరోగా ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో కథానాయికగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :