“హీరో”కి నిధి అగర్వాల్ అంత రెమ్యునరేషన్ తీసుకుందా?

Published on Jan 18, 2022 3:02 am IST

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా ఇటీవల హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేస్ నుండి పాన్ ఇండియా సినిమాలన్నీ తప్పుకున్న తర్వాత అశోక్ గల్లా మొదటి సినిమా ‘హీరో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ అలరించగా, ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారింది.

హీరోగా పరిచయమవుతున్న అశోక్ గల్లా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడంతో “హీరో” సినిమాకు నిధి పెద్ద ప్లస్‌గా నిలిచింది. అంతకు ముందు సినిమాలకు కేవలం రూ.50 నుండి 80 లక్షలు పారితోషికం అందుకున్న నిధి “హీరో” సినిమాకు ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందట. దర్శకనిర్మాతలు కూడా నిధి డిమాండ్‌కు తగినట్టుగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్, ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. ఆ తర్వాత చేసిన ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగింది.

సంబంధిత సమాచారం :