నేను సినిమాల్లో నటించడం నా భర్తకు ఇష్టం లేదు – నిహారిక

Published on Nov 25, 2021 3:02 am IST


మెగా డాటర్ నిహారిక తన యాంకరింగ్‌తోనే కాకుండా అల్లరితో, యాక్టింగ్‌తో అలరించి ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటుతోంది. అయితే తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను సినిమాల్లో ఎందుకు నటించడం లేదన్న విషయంపై స్పందిస్తూ తన భర్త చైతన్యకు తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, అందుకే సినిమాలను చేయడం లేదని నిహారిక చెప్పుకొచ్చింది.

అయితే టీచ్‌ ఫర్‌ ఇండియా అనే కార్యక్రమంలో పిల్లలకు కొద్ది రోజులు పాఠాలు చెప్పానని, అయినా సినిమాలపై ఇష్టం తగ్గకపోవడంతో సొంతంగా ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశానని చెప్పుకొచ్చింది. ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచీ వంటి వెబ్ సిరీస్‌లు తీశానని, ఇటీవల ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ని కూడా నిర్మాతగా వ్యవహరించానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :