‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏంటో రివీల్ చేసిన మెగా డాటర్ నిహారిక..!

Published on Oct 30, 2021 1:54 am IST


మెగా డాటర్ నిహారిక ‘ఓసీఎఫ్ఎస్’ అనే వెబ్ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లు కాగా, టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే అసలు ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ఏమై ఉంటుందబ్బా అని అంతా ఆలోచనలో పడ్డారు.

అయితే తాజాగా ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని అర్థం అనే విషయాన్ని నిహారిక రివీల్ చేశారు. నిహారిక ఫాదర్ నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా నేడు ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న ఉండనుంది.

సంబంధిత సమాచారం :

More