“ఆపండ్రోయ్”.. మెగా డాటర్ నిహారిక స్కైడైవింగ్..!

Published on Dec 7, 2021 2:43 am IST


మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్యతో కలసి ప్రస్తుతం స్పెయిన్‌లో విహరిస్తోంది. ఈ నెల 9న వారి వివాహ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట విహారయాత్రకి వెళ్లింది. అయితే స్పెయిన్‌లో నిహారిక స్కైడైవింగ్‌ను చేసింది. ఎంతగానో భయపడుతూ మొత్తానికి పూర్తి చేసింది.

దీనికి సంబంధంచిన వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటూ నేను చేసాను.. చాలా పారవశ్యంగా ఫీలవుతున్నా.. నా ఆపండ్రోయ్ మూమెంట్ అంటూ పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే నిహారిక తన యాంకరింగ్‌తోనే కాకుండా అల్లరితో, యాక్టింగ్‌తో అలరించి ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటుతోంది. సొంతంగా ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసింది. ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచీ వంటి వెబ్ సిరీస్‌లు తీసింది. ఇటీవల ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌కి నిర్మాతగా వ్యవహరించింది.

సంబంధిత సమాచారం :