
2013లో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘ఆషికి 2’. ఈ సినిమాని తెలుగులో ‘నీజగా నేనుండాలి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘ఒరేయ్ పండు’, ‘మౌనమేలనోయి’ ఫేం సచిన్ హీరోగా, నజియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియోని జూన్లో రిలీజ్ చేసారు.
ఇటీవలే ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఈ వారం ఈ సినిమా విడుదల కావడం లేదు. అనుకున్నదానికి ఒక వారం ఆలస్యంగా ఆగష్టు 22న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘బంపర్ ఆఫర్’ సినిమాకి దర్శకత్వం వహించిన రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి జీత్ గంగూలీ, మిథూన్, అంకిత్ కలిసి సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ లో లానే తెలుగులో కూడా ఈ లవ్ స్టొరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటున్నారు.