లాస్ట్ షెడ్యూల్ లో నిఖిల్ ’18 పేజెస్’… డిసెంబర్ 23న మూవీ రిలీజ్

లాస్ట్ షెడ్యూల్ లో నిఖిల్ ’18 పేజెస్’… డిసెంబర్ 23న మూవీ రిలీజ్

Published on Oct 26, 2022 7:04 PM IST

ఇటీవల కార్తికేయ 2 మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న యువ నటుడు నిఖిల్ సిద్దార్థ తాజాగా నటిస్తున్న మూవీ 18 పేజెస్. షూటింగ్ ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దీనికి కథని అందిస్తున్నారు. అలానే సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి గోపిసుందర్ సంగీతం అందిస్తుండగా ఏ వసంత్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇక ఈ మూవీ ఈనెల 18 నుండి లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటుండగా హీరో నిఖిల్ ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

కాగా ఈ నాస్టాల్జిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై యువ నిర్మాత బన్నీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ మూవీని డిసెంబర్ 23న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ 18 పేజెస్ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు