రవితేజతో పోటీకి సిద్ధమవుతున్న నిఖిల్..?

Published on Mar 24, 2022 3:01 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ’18 ఫేజెస్’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిదే. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. మరో పది రోజుల్లో షూటింగు పార్టును పూర్తిచేసుకోబోతున్న ఈ చిత్రాన్ని జూన్ 17వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట మేకర్స్.

అయితే అదే రోజున రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా థియేటర్లకు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. ’18 పేజెస్’ తరువాత ‘కార్తికేయ 2’ను కూడా నిఖిల్ రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కూడా కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కావడం విశేషం.

సంబంధిత సమాచారం :