స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో నిఖిల్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్.!

Published on Apr 17, 2022 11:14 am IST


మన టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తన సినిమాలకంటూ ఒక స్పెషల్ మార్క్ ని చేసుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. స్వామి రారా తర్వాత ఇక నిఖిల్ నుంచి ఓ సినిమా వస్తుంది అంటే ఒక కొత్త సబ్జెక్ట్ లేదా మంచి థ్రిల్లర్ తో వస్తాడు అనే మార్క్ ఉంది. అలా అందుకు తగ్గట్టు గానే తాను ఇప్పటికీ మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అయితే నిన్ననే మేకర్స్ యంగ్ దర్శకుడు గ్యారీ బి హెచ్ తో నిఖిల్ 19వ సినిమాపై ఈరోజు బిగ్ అనౌన్సమెంట్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇపుడు ఈ సినిమాని రివీల్ చేశారు. ఒక స్టన్నింగ్ ఫస్ట్ లుక్ తో సినిమాకి “స్పై” అనే టైటిల్ ని రివీల్ చేశారు. పైగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు.

ఇది వరకు నిఖిల్ నుంచి ఎన్నో థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఏకంగా స్పై జానర్ లో సినిమా చేస్తుండడం మరింత ఆసక్తిగా ఉందని చెప్పాలి. మరి ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాకి కథ మరియు నిర్మాణం కే రాజశేఖర్ రెడ్డి అందిస్తున్నారు. అలాగే సంగీతం శ్రీచరణ్ పాకల అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :