రాజమండ్రి లో కిరాక్ పార్టి షూటింగ్ !

13th, December 2017 - 09:30:39 AM

ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిఖిల్ చేస్తున్న సినిమా కిరాక్ పార్టీ. కన్నడలో మంచి విజయం సాదించిన కిరాక్ పార్టీకి ఈ సినిమా రీమేక్. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో దాదాపు టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. ఇటివల విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ కు మంచి రెస్పోన్స్ లభించింది.

కాలేజీ ఫ్రెండ్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో హిట్ అవుతుందని మూవీ యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. సంయుక్తా హెగ్డే మరియు సిమ్రాన్ పరీన్జా నిఖిల్ కు జోడిగా నటిస్తున్నారు. అజనీష్ లొకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి, సుదీర్ వర్మ రచన సహకారం అందిస్తున్నారు. ఫిబ్రవరి 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.