“కార్తికేయ 3” పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిఖిల్.!

“కార్తికేయ 3” పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిఖిల్.!

Published on Dec 27, 2022 7:02 AM IST

ఈ ఏడాది ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా నార్త్ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లతో భారీ లాభాలు తెచ్చి పెట్టిన చిత్రాల్లో “కార్తికేయ 2” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి థ్రిల్లర్ అడ్వెంచర్ గా వచ్చి సూపర్ హిట్ కాగా ఇక ఈ సీక్వెల్ కి సీక్వెల్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

మరి లేటెస్ట్ గా అయితే నిఖిల్ “కార్తికేయ 3” పై క్రేజీ అప్డేట్ ని అందించాడు. కార్తికేయ 3 చిత్రం డెఫినెట్ గా ఉంది అని అలాగే దర్శకుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే నరేట్ చేసాడు అని అంతే కాకుండా ఈసారి చిత్రం 3D లో కూడా ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేసి క్రేజీ అప్డేట్ అయితే అందించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు