టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘స్వయభూ” కోసం తెలిసిందే. మరి ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే క్రేజీ హైప్ ని తెచ్చుకోగా మేకర్స్ అంతే గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతోనే నిఖిల్ కూడా మొట్ట మొదటి సారి ఓ వారియర్ గా కనిపించబోతుండగా అందుకోసం అయితే ఇప్పుడు గట్టిగా కష్టపడుతున్నాడు.
తన స్వయభూ కోసం తాను ప్రాక్టీస్ నుంచి ఓ పిక్ షేర్ చేసి అయితే కర్ర సాము, మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధం లాంటివి చేస్తున్నట్టుగా తాను తెలిపాడు. మొత్తానికి అయితే ఈ సినిమా కోసం మాత్రం తాను చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పిక్సెల్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.
Working Towards the TARGET #Swayambhu Training… #martialarts #sword #swordfight pic.twitter.com/2GE1HklWnj
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 13, 2023