కార్తికేయ2 తో మారిపోయిన నిఖిల్ గ్రాఫ్… రెమ్యునరేషన్ కూడా!

కార్తికేయ2 తో మారిపోయిన నిఖిల్ గ్రాఫ్… రెమ్యునరేషన్ కూడా!

Published on Dec 14, 2022 12:21 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గత రెండేళ్లుగా పెద్ద రిలీజ్ లు లేకపోవడం తో అస్తవ్యస్తంగా ఉన్నాడు. అతని ప్రత్యేక చిత్రం, కార్తికేయ 2 చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. కానీ, ఈ చిత్రం విడుదలయ్యాక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. సినిమా విజయంతో నిఖిల్ ఇప్పుడు తన ఫీజును భారీగా పెంచేశాడు.

మొదట్లో ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు వసూలు చేసిన ఆయన ఇప్పుడు సైన్ చేసిన కొత్త సినిమాలకు 8 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిఖిల్ నుండి పెద్ద ఎత్తుగడ అని చెప్పాలి. అతను కార్తికేయ 2 తో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పాపులారిటీని పూర్తిగా ఉపయోగించు కుంటున్నాడు. త్వరలో విడుదల కానున్న 18 పేజెస్ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో ఆయన నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు