మరో సాలిడ్ ప్రాజెక్ట్ లాక్ చేసిన నిఖిల్.!

Published on May 12, 2023 1:13 pm IST

మన టాలీవుడ్ లో యంగ్ హీరోస్ లో ఈ హీరో నుంచి సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ కొత్త సబ్జెక్టు లతో వస్తాడు అని ముద్ర ఉన్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. త స్వామి రారా నుంచి ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో ఇప్పుడు సాలిడ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ చిత్రం “స్పై” తో సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ యంగ్ హీరో లైనప్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ మాకు తెలిసింది. మరి నిఖిల్ అయితే ఇప్పుడు తన స్వామి రారా దర్శకుడు సుధీర్ వర్మతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

రీసెంట్ గానే సుధీర్ వర్మ ఓ కథని నరేట్ చేయగా నిఖిల్ కి అయితే ఈ కథ నచ్చిందని తెలుస్తుంది. దీనితో వెంటనే ఓకే చేసాడట. ఇక ఈ చిత్రంలో అయితే మజిలీ యంగ్ హీరోయిన్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటించనుందట. మరి సుధీర్ వర్మ అయితే రీసెంట్ చేసిన చిత్రం “రావణాసుర” కాగా దీనికి థ్రిల్లర్ మూవీ లవర్స్ నుంచి డీసెంట్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక మరి సిద్ధార్థ్ తో ఎలాంటి సినిమా చేయనున్నాడో చూడాలి.

సంబంధిత సమాచారం :