నిఖిల్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు !

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహించే నిఖిల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. చాలా మంది నిర్మాతలు ఈ హీరోతో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నారు. తాజాగా ఈ హీరో కన్నడలో హిట్ అయిన కిరిక్ పార్టి సినిమాను కిరాక్ పార్టి సినిమాగా తీస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది.

తాజా సమాచారం మేరకు ఈ హీరో మరో రీమేక్ లో నటించబోతున్నాడని సమాచారం. తమిళ్ లో వచ్చిన కనితన్ ను తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నాడు నిఖిల్. ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. జనవరి 19 నుండి ఈ సినిమా మొదలుకానుంది. ఈ మూవీని తమిళ్ లో డైరెక్ట్ చేసిన సంతోష్ తెలుగులో కూడా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు నిర్మాత ఠాగూర్ మధు.