ఆల్రెడీ లాభాల్లో నిఖిల్ “18 పేజెస్”.!

ఆల్రెడీ లాభాల్లో నిఖిల్ “18 పేజెస్”.!

Published on Dec 24, 2022 5:13 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం “కార్తికేయ 2” తో ఈ ఏడాదిలో తాను ఆల్రెడీ భారీ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా వచ్చిన చిత్రమే “18 పేజెస్”. యువ దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కించిన ఈ చిత్రం సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చింది.

ఇక ఈ చిత్రానికి కూడా నుంచి మంచి మౌత్ టాక్ రాగ వసూళ్లు కూడా డీసెంట్ గా నమోదు అయ్యినట్టు తెలుస్తుంది. ఇక అలా ఈ చిత్రం అయితే ఆల్రెడీ లాభాల్లో ఉన్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ కి గాను అది కేవలం ఆల్రెడీ నాన్ థియేట్రికల్ హక్కులతోనే వచ్చేసింది అని.

అలాగే మొదటి రోజులోనే సినిమాకి థియేట్రికల్ పరంగా జరిగిన బిజినెస్ లో చాలా వరకు వెనక్కి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం ఆల్రెడీ లాభాల్లోకి వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో కూడా నిఖిల్ సరసన అనుపమ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు