జెట్ స్పీడ్ లో నిఖిల్ భారీ థ్రిల్లర్ షూట్.!

Published on May 21, 2022 11:00 am IST


యంగ్ అండ్ టాలెంటడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో తన కెరీర్ హై బడ్జెట్ సినిమా అయినటువంటి ప్రాజెక్ట్ “స్పై” కూడా ఒకటి. రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన ఈ చిత్రాన్ని దర్శకుడు గ్యారీ బి హెచ్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడట.

భారీ యాక్షన్ సీక్వెన్స్ లను కంప్లీట్ చేస్తూ ప్రస్తుతం ఈ చిత్రం జెట్ స్పీడ్ లో షూటింగ్ ని జరుపుకుంటున్నట్టు చిత్ర యూనిట్ ఒక ఫోటో ని కూడా షేర్ చేశారు. అయితే ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విటేకర్ చేస్తుండడం విశేషం.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ స్థాయిలో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది దసరా రేస్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :