సీక్వెల్స్ ట్రెండ్ లో “కార్తికేయ 2” కి కూడా సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్..!

సీక్వెల్స్ ట్రెండ్ లో “కార్తికేయ 2” కి కూడా సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్..!

Published on Aug 13, 2022 8:00 PM IST


తెలుగు సినిమా దగ్గర గత జూలై నెల లో నెలకొన్న సంక్షోభం ఒక్కసారిగా పరిస్థితులు తారు మారు చేసింది. అనుకోని రీతిలో ఆడియెన్స్ థియేటర్స్ వైపు రాకపోతుండడంతో వరుసగా అనేక సినిమాలు ప్లాప్ గా నిలిచిపోయాయి. కానీ టాలీవుడ్ సరైన కంటెంట్ ఇస్తే హిట్ చేస్తాం అన్నట్టుగా గత వారం నుంచి వచ్చిన రెండు సినిమాలు నుంచి టాలీవుడ్ లో మళ్ళీ సాలిడ్ పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి.

మరి ఈ వారం కూడా సినిమాలకి పాజిటివ్ ఓపెనింగ్స్ వస్తుండగా ఈ శనివారం రిలీజ్ అయినటువంటి నిఖిల్ అవైటెడ్ చిత్రం “కార్తికేయ 2” కూడా అందరి అంచనాలు అందుకొని సాలిడ్ పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన దర్శకుడు చందూ మొండేటి సీక్వెల్స్ హవాలో మరో హిట్ గా ఈ చిత్రాన్ని నిలపడం విశేషం.. దీనితో మన టాలీవుడ్ నుంచి మరో హిట్ సీక్వెల్ గా ఈ చిత్రం నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా వసూళ్లు అయితే ఎలా నమోదు అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు