మరింత ఆసక్తి రేపుతున్న “కార్తికేయ 2” మోషన్ పోస్టర్ టీజర్.!

Published on Jun 1, 2022 9:54 am IST


మన టాలీవుడ్ లో తన సినిమాల ట్రాక్ మార్చి ఒక మంచి థ్రిల్లర్ సినిమా వస్తుంది అంటే దానికి కేరాఫ్ గా నిలిచిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. స్వామి రారా నుంచి రోతు మార్చిన ఈ యంగ్ హీరో అక్కడ నుంచి ఎప్పుడూ తెలుగు ఆడియెన్స్ ని నిరాశ పరచలేదు. సాలిడ్ సబ్జెక్ట్స్ తో ఎప్పటికప్పుడు థ్రిల్ ని కలిగిస్తూనే మరిన్ని ఆసక్తికర సినిమాల్తో పాన్ ఇండియా రేంజ్ కి తన సినిమాలు తీసుకెళ్లే విధంగా చేస్తున్నాడు.

అయితే తన కెరీర్ లో భారీ హిట్ అయినటువంటి సినిమా “కార్తికేయ” కి సీక్వెల్ గా దర్శకుడు చందు మొండేటితో మళ్ళీ తీసిన ఇంట్రెస్టింగ్ సినిమా “కార్తికేయ 2”. అనౌన్సమెంట్స్ ప్రీ లుక్ పోస్టర్స్ తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ నిఖిల్ నిర్మాత డే కానుకగా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ ని రిలీజ్ చేసారు.

అయితే జస్ట్ ఒక్క డైలాగ్ తో మాత్రమే ఉన్న ఈ టీజర్ మంచి ఆసక్తి రేపింది అని చెప్పాలి. అలాగే హీరోయిన్ అనుపమ కూడా ఇందులో కనిపిస్తుంది. మరి పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసిన ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించగా ఈ చిత్రం జూలై 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :