నిఖిల్ సిద్దార్ధ ’18 పేజెస్’ ఫస్ట్ వీక్ లో ఎంత కలెక్ట్ చేసిందంటే ?

నిఖిల్ సిద్దార్ధ ’18 పేజెస్’ ఫస్ట్ వీక్ లో ఎంత కలెక్ట్ చేసిందంటే ?

Published on Dec 30, 2022 5:00 PM IST


నిఖిల్ సిద్దార్ధ హీరోగా యువ నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎమోషనల్ మూవీ 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందించారు. ఇక ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన 18 పేజెస్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ లో రొమాంటిక్, యక్షన్, లవ్, ఎమోషనల్ సీన్స్ వంటివి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే విషయం ఏమిటంటే, మొత్తంగా గడచిన ఫస్ట్ వీక్ లో 18 పేజెస్ మూవీ టోటల్ గా రూ. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ని దక్కించుకుందని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషయల్ గా అనౌన్స్ చేసారు. ప్రస్తుతం తమ సినిమా చాలా ప్రాంతాల్లో ఇంకా మంచి ఆదరణతో కొనసాగుతుండడం ఎంతో సంతోషంగా ఉందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు