ఆసక్తిగా మారిన నిఖిల్ ఎలక్షన్ ట్వీట్.!

Published on Sep 18, 2023 4:04 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు తనదైన ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా నిఖిల్ అయితే లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో లో పెట్టిన పోస్ట్ అయితే ఆసక్తిగా మారింది.

అయితే ఇది ఒకింత షాకింగ్ అని చెప్పాలి. జస్ట్ 6 నెలలు మాత్రమే అంటూ పోటీలో గెలిస్తే ఆ కిక్కే వేరప్పా నేను ఏ పార్టీ కూడా కాదు అంటూ తన కిరాక్ పార్టీ సినిమా నుంచి క్లిప్ ని అయితే పోస్ట్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ ఇపుడు ఆసక్తిగా మారింది.

దీని తర్వాత అయితే కిరాక్ పార్టీలో సాంగ్ క్లిప్ లో ఇంకో పోస్ట్ పెట్టి మరో 6 నెలల్లో ఎలక్షన్ సీజన్ పెట్రా చిన్నా కూలింగ్ గ్లాసు అంటూ వీడియో పూర్తిగా చూడండి అని కిరాక్ పార్టీలో క్లిప్ తో తెలిపాడు. దీనితో ఈ సడెన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :