“18 పేజెస్” లో తన ఫేవరెట్ సాంగ్ పై నిఖిల్ పోస్ట్!

“18 పేజెస్” లో తన ఫేవరెట్ సాంగ్ పై నిఖిల్ పోస్ట్!

Published on Dec 8, 2022 9:57 PM IST


యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 18 పేజెస్. ఈ చిత్రం ను డిసెంబర్ 23, 2022 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం నుండి మూడో సింగిల్ ను చిత్ర యూనిట్ త్వరలో విడుదల చేయనుంది. డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ స్టోరీ అందిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూడో పాట కి శ్రీమణి లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ పాడటం జరిగింది. ఈ పాట తన మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని తెలిపారు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు