అల్లు శిరీష్ కి హీరో నిఖిల్ సిద్ధార్థ్ కంగ్రాట్స్!

అల్లు శిరీష్ కి హీరో నిఖిల్ సిద్ధార్థ్ కంగ్రాట్స్!

Published on Nov 8, 2022 4:32 PM IST


అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊర్వశివో రాక్షసివో. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. అయితే ఈ చిత్రం పై తాజాగా హీరోగా నిఖిల్ సిద్ధార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా కి పాజిటివ్ టాక్ రావడం పట్ల నిఖిల్ సిద్ధార్థ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక అల్లు శిరీష్ కి కంగ్రాట్స్ తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్ల లో చూస్తాను అని తెలిపారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ మరియు గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకాల పై నిర్మించిన ఈ చిత్రానికి అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం లో అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా అను ఎమ్మన్యూయేల్ నటించగా, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు