వైరల్ అవుతున్న నిఖిల్ సరికొత్త ఫోటో!

Published on Feb 20, 2022 10:45 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరికొత్త కథాంశాలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఐడీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు రెడ్ సినిమాస్ పతాకాల పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి గారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ప్రకటించలేదు. ఈ చిత్రం ను స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న విషయాన్ని వెల్లడించారు.

ఈ చిత్రం ను ప్రకటించిన అనంతరం నుండి సినిమా కి సంబందించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం లో నిఖిల్ ఏ విధముగా ఉండనున్నారు అనే దాని పై ఒక క్లారిటీ వచ్చింది. తాజాగా సోషల్ మీడియా వేదిక గా నిఖిల్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. గన్స్ పట్టుకొని ఉన్న నిఖిల్, లైవ్ వెపన్స్ తో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఇది ఈ స్పై థ్రిల్లర్ కోసం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :