మరో లెవెల్ లోకి నిఖిల్…ఆకట్టుకుంటున్న “స్పై” గ్లింప్స్

Published on Jun 6, 2022 11:15 am IST

ప్రామిసింగ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ యొక్క మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ స్పై. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్‌కి ఇది తొలి దర్శకత్వ వెంచర్‌. చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌లపాటి సీఈవోగా ఎడ్ ఎంట్ర‌న్‌మెంట్స్‌ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిఖిల్‌ని స్పై గా పరిచయం చేస్తూ, ఒక చిన్న గ్లింప్స్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. చేతిలో ట్రాన్స్‌మిటర్‌తో మంచు పర్వతాల మీద నడుస్తున్న హీరో, చివరకు ఆయుధాలతో నిండిన రహస్య ప్రదేశాన్ని కనుగొనడాన్ని వీడియోలో చూపించడం జరిగింది. ఆయుధాలతో నిఖిల్ బైక్ నడుపుతూ శత్రువులను కాల్చిచంపడం ద్వారా యాక్షన్‌లోకి దిగాడు.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, రాబోయే వాటికి టోన్ సెట్ చేసే యాక్షన్ ప్యాక్డ్ వీడియోలో నిఖిల్ స్లిక్, స్టైలిష్ మరియు డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్న ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు మరియు ఇది అతనికి పర్ఫెక్ట్ రీ ఎంట్రీ మూవీ అని చెప్పాలి.

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ కీలక పాత్రలో నటించారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా, హాలీవుడ్ డిఓపి జూలియన్ అమరు ఎస్ట్రాడా కెమెరా డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్, రాబర్ట్ లీనెన్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి నిర్మాత కె రాజ శేఖర్ రెడ్డి కథను అందించగా, శ్రీచరణ్ పాకాల సౌండ్‌ట్రాక్‌లను అందించారు. అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని నిర్వహిస్తుండగా, చరణ్ తేజ్ ఉప్పలపాటి బ్యానర్ సీఈఓగా నిర్మాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం లో అభినవ్ గోమతం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :