జీరో కట్స్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న “18 పేజెస్”

జీరో కట్స్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న “18 పేజెస్”

Published on Dec 16, 2022 2:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, గార్జియస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. ఈ చిత్రం ను ఈ నెల 23 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. జీరో కట్స్ తో సెన్సార్ పూర్తి అయిన విషయాన్ని చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ అందించడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిఫెరెంట్, నెవర్ బిఫోర్ స్క్రిప్ట్ గా వస్తున్న ఈ సినిమా కి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పల్నాటి సూర్య ప్రతాప్ అందిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు