నిఖిల్ “కార్తికేయ 2” టీజర్‌కి డేట్ ఫిక్స్!

Published on Jun 20, 2022 12:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన సూపర్ హిట్ మూవీ కార్తికేయ సీక్వెల్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. కార్తికేయ 2 జూలై 22, 2022న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నందున, టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఒక ప్రకటన చేయడం జరిగింది. టీజర్ ను జూన్ 22, 2022 న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం లో అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాస రెడ్డి, హర్ష చెముడు తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :