నిఖిల్ “కార్తికేయ2” కి మూడో రోజు భారీ వసూళ్లు!

నిఖిల్ “కార్తికేయ2” కి మూడో రోజు భారీ వసూళ్లు!

Published on Aug 15, 2022 10:02 PM IST

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మిస్టరీ డ్రామాకి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన ఇతర భారీ చిత్రాలు ఉన్నందున, కార్తికేయ 2 కి ఎక్కువ స్క్రీన్‌లు రాలేదు. అయితే ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇండిపెండెన్స్ డే హాలిడే కారణంగా ఆక్యుపెన్సీ సాలిడ్ గా ఉండటంతో సినిమా మూడో రోజు కలెక్షన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. మౌత్ టాక్ చాలా బలంగా ఉంది మరియు నిఖిల్ కూడా సినిమాను వార్తల్లో ఉంచడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో గట్టి వసూళ్లను రాబడుతుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు