యూఎస్ బాక్సాఫీస్ వద్ద “కార్తికేయ2” సెన్సేషన్!

యూఎస్ బాక్సాఫీస్ వద్ద “కార్తికేయ2” సెన్సేషన్!

Published on Aug 15, 2022 12:50 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రెండో రోజు థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతున్నాయి. అదే తరహా లో యూ ఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం 450కే డాలర్లను రాబట్టింది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ లో ఈ వసూళ్లు బెస్ట్ అని చెప్పాలి.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, నార్త్ లో కూడా హిందీ వెర్షన్ మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు కి, రెండో రోజుకి భారీ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, హర్ష చెముడు, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు