నిఖిల్ “స్పై” టీజర్ కు అదిరిపోయిన రెస్పాన్స్!

Published on May 16, 2023 6:11 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో, గ్యారీ BH దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ స్పై. నేషనల్ థ్రిల్లర్ స్పై టీజర్ ను నిన్న న్యూ ఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కర్తవ్య మార్గ్ వద్ద మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది సుభాష్ చంద్రబోస్ గురించి. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది.

ఈ టీజర్ ఇప్పటి వరకూ 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. 133 కే కి పైగా లైక్స్ ను రాబట్టింది. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమతం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ క్యూరియాసిటీని క్రియేట్ చేసి సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రాన్ని ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి, చరణ్‌తేజ్ ఉప్పలపాటితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి నిర్మాత అయిన కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు. స్పై ఈ ఏడాది జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :